Beauty Tips


Natural tips for Beautiful hair

ఈ కాలంలో చర్మంతో పాటూ జుట్టుకు సంబంధించిన రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటివన్నీ దూరమై మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం.
తరచూ ఆముదంతో తలకు మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది. ఆముదంలో ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మర్దన చేసినప్పుడు ఈ ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. మాడుకు కూడా చాలామంచిది. వారంలో రెండుసార్లు కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని మర్దన చేసుకోవాలి. మర్నాడు గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలిపోవడం అదుపులోకి వస్తుంది.
* ఆముదంలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఆ గుణాలు దురద, ఇతర జుట్టు సమస్యలు అదుపులోకి వచ్చేస్తాయి.అదే సమయంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
* తరచూ కత్తిరిస్తున్నా జుట్టు చివర్లు చిట్లుతుంటాయి చాలామందికి. అలాంటి వారికి ఆముదం చాలా చక్కగా పని చేస్తుంది. ఆముదాన్ని వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక జుట్టుకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేస్తే సరి. ఇలా చేయడం వల్ల జుట్టుకు కుదుళ్ల నుంచి చివరి వరకూ పోషణ లభిస్తుంది. చిట్లు తాయన్న ఇబ్బంది ఉండదు.
* ఆముదం చక్కటి కండిషనర్‌గానూ పనిచేస్తుంది. ఆముదం జుట్టుకు తేమనందిస్తుంది. జుట్టుపొడిబారి ఎండుగడ్డిలా మారి ఇబ్బంది పడుతున్నవారు కొబ్బరి నూనెలో కలిపి ఆముదాన్ని రాసుకోవడం అలల్లా తేలియాడే కురులు సొంతమవుతాయి.
* జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇలా చేయొచ్చు... నాలుగు చెంచాల చొప్పున కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన కలిపి... తలకు పూతలా వేసుకోవాలి. ఓ గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే....జుట్టు రాలకుండా ఉంటుంది.
more details about beauty tips visit us
http://bpositivetelugu.com/index.php/andham/details/NTI_

No comments:

Post a Comment