Precautions to be taken for the coming summer
వేసవిలో ఆరోగ్య పరిరక్షణ
వేసవి కాలం వచ్చీరాక ముందే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి . వేసవి అంటే కేవలం సెలవులూ, సంతోషాలు, ఆహ్లాదకరమైన సాయంత్రాలు గుర్తుకు వస్తాయి. పిల్లలకు ఇది ఎంతో ప్రత్యేకమైన సమయం. పిల్లలు, పెద్దలు ఆనందంగా సెలవులను ఆస్వాదించే ఈ రోజుల్లోనే జలకాలుష్యం మొదలు పలు కారణాలవల్ల వాంతులు, విరేచనాల వంటి పలు సమస్యలు చీకాకు పెడుతుంటాయి. దీనివల్ల శరీరంలోని నీరంతా బయటికి పోయి మనిషి నీరసపడి పోతాడు. పిల్లలు ఈ సమస్య బారిన పడితే ఒకపట్టాన కోలుకోవటం సాధ్యం కాదు. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే ఈ అనారోగ్య సమస్య పట్ల అందరూ తగిన అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం.
లక్షణాలు
సమస్య మొదలయ్యే దశలో పొట్ట నొప్పితో బాటు నీళ్ళ విరేచనాలు అవుతాయి. కొన్నిసార్లు పదేశి సార్లు కూడా అవ్వొచ్చు. జ్వరంతో బాటు వాంతులు కూడా అవుతాయి. వాంతులు, విరేచనాల మూలంగా ఒంట్లోని నీరు, లవణాలు బయటికి పోయి మనిషి త్వరగా నీరస పడిపోతాడు. అందుకే ఈ సమస్య వచ్చినవారు వీలున్నంత నీరు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, గ్లూకోస్ వంటివి అధికంగా తీసుకోవాలి. లేకపోతే డీ హైడ్రేషన్ బారిన పడ్డాల్సి వస్తుంది.
ఆహార నియమాలు
- వాంతులు, విరేచనాలతో బాధ పడే వారు ఘనాహారాన్ని తగ్గించుకుని తేలికపాటి ఆహారంతో బాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.
- నిర్ణీత వ్యవధిలో ఉప్పు,పంచదార కలిపిన నీరు, లేక ఎలక్ట్రోల్ పొడి కలిపిన నీరు అందించాలి. ఈ ఎలక్ట్రోల్ పొడిని అవసరమైనప్పుడల్లా ఒక్కో చెంచా చొప్పున నీటిలో కలుపుకోవటం కంటే ఒకేసారి లీటరు నీటిలో మొత్తం పాకెట్ పొడినీ కలిపి రోజంతా గ్లాసెడు చొప్పున తాగటం మంచిది.
- వాంతులు తగ్గినా, ఉప్పు వేసిన మజ్జిగ, కొబ్బరి నీరు, గంజి, సగ్గుబియ్యం జావ, క్యారెట్ సూప్ వంటివి ఇవ్వాలి.
- చనుపాలు, పోతపాలు తాగే పిల్లలకు ఎప్పటిలాగే పాలివ్వాలి.
- వాంతులు తగ్గిన తర్వాత అటుకులు, మరమరాలు, ఇడ్లీ, ఉప్మా వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
- ఒకటి, రెండు రోజులైనా విరేచనాలు,వాంతులు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.
డీ హైడ్రేషన్ గా మారితే
తొలి రోజు దాహంగా ఉంటుంది. పసి పిల్లలైతే ఆపకుండా ఏడుస్తూ ఉంటాలు. పెద్దల్లో చికాకు, నీరసం, ఏ పనిమీదికీ మనసు పోకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. కళ్ళు లోపలికి పీక్కుపోతాయి. నాలుక, కళ్ళు పొడి బారతాయి. చర్మం సాగినట్లు కనిపించి, కాంతిని కోల్పోతుంది. డీ హైడ్రేషన్ ఎక్కువైన కొద్దీ పిల్లల నాడి వేగం తగ్గటం, సృహ కోల్పోవటం జరుగుతుంది.
చికిత్స
వాంతులు, విరేచనాలు ఆగిపోవటానికి అందుబాటులో ఉన్న మందులు వాడితే సమస్య అప్పటికి తగ్గినట్లు అనిపించినా, పేగులలోని వ్యర్ధాలు లోలోపలే ఉండి, ఒక్కసారిగా తీవ్రతతో కూడిన విరేచనాలు కావచ్చు. అందుకే ఈ విషయంలో సొంత వైద్యాలకు పూనుకోకుండా వైద్యుల సలహాను పాటించాలి. అప్పటికప్పుడు అయ్యే వాంతులు, విరేచనాల విషయంలో కంగారు పడకుండా పైన చెప్పిన సాధారణ జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, గ్లూకోస్, మజ్జిగ వంటివి తీసుకోవాలి. విరేచానంలో రక్తం, జిగురు వంటివి కనిపిస్తే వైద్యుల సలహా కోరాల్సిందే.
ఇతర జాగ్రత్తలు
- మలమూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ విధిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
- వంటకు ముందు, వడ్డనకు ముందు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి.
- ఈ సీజన్లో ముగిసే వరకు వేడి వేడి ఆహారం మాత్రమే తినాలి.
- మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని కాచి, వడపోసి తాగాలి.
- రోడ్డు వెంట, హోటళ్ళలో ఆహారం తీసుకునే వారు వెంట తీసుకెళ్ళిన నీటిని గానీ, వాటర్ బాటిల్ కొనుక్కొనిగానీ తాగటం మంచిది.
- చెరుకు రసా��
for more details about health tips visit
http://bpositivetelugu.com/index.php/andham/details/NjI_

No comments:
Post a Comment